Illu illalu pillalu : మేనకోడలి పెళ్ళికి ఆమెను పిలుస్తారా.. సూపర్ ట్విస్ట్!
on Jan 1, 2025
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -44 లో......తిరుపతి భద్రవతి వాళ్ళ దగ్గరికి వెళ్లి.. ఏం జరుగుతుందని అడుగగా నా మేనకోడలు పెళ్లి జరుగుతుందని భద్రవతి వేదవతి వాళ్ళకి వినపడేలా మాట్లాడుతుంది. నా మేనకోడలు పెళ్లి గ్రాండ్ గా చేస్తున్నాను. నాకు మాత్రమే మేనకోడలు పెంపకం అంటే తెలుసు.. ఇది కొందరికి పెంచడం చేతకాదు లేచిపోయి పెళ్లిచేసుకుంటారు.
మా కుటుంబం నచ్చి అమెరికా సంబంధం వెతుక్కుంటూ వచ్చిందని వేదవతి వాళ్ళను తక్కువ చేసి మాట్లాడుతుంది భద్రవతి. మరొకవైపు ధీరజ్ దగ్గరికి తిరుపతి వచ్చి ప్రేమ పెళ్లి అవుతుందని చెప్పగానే.. మంచి పని అవుతుందంటూ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వేంటి రా బాధపడుతావనుకుంటే ఇలా మాట్లాడుతున్నవంటూ తిరుపతి అనగానే..అదేదో ఆ కళ్యాణ్ మాయలో పడుతుందని అలా తిట్టాను అంతే అని ధీరజ్ అంటాడు. మరొకవైపు వేదవతి కిచెన్ లో ఉండగా నర్మద వచ్చి మీ మేనకోడలికి హల్ది ఫంక్షన్ జరుగుతుందని చెప్తుంది.
ఆ తర్వాత వేదవతి వెళ్లి ప్రేమ హల్దీ ఫంక్షన్ చాటుగా చూస్తుంటే.. అది గమనించిన భద్రవతి చూడకుండా కర్టెన్ అడ్డుపెడుతుంది. దాంతో వేదవతి కోపంగా లోపలికి వచ్చి అందరిపై చిర్రుబుర్రులాడుతుంది. ఆ తర్వాత ప్రేమకి ఫోన్ చేస్తుంటాడు కళ్యాణ్. తరువాయి భాగంలో సేనాపతి, రేవతి లు అందరికి పెళ్లి పత్రిక ఇస్తుంటారు. వేదవతి, నర్మదలు కూరగాయలు కొంటుంటే.. సేనాపతి వాళ్ళ దగ్గరికి వస్తాడు. తనకి కార్డ్ ఇవ్వడానికి వచ్చాడేమోనని వేదవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది కానీ కూరగాయలు అమ్మే అతనికి కార్డు ఇస్తాడు. దాంతో వేధవతి బాధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Also Read